హాస్పిటల్ లో రవితేజ.. షూటింగ్ లో ప్రమాదం..

Spread the love

సినిమా హీరోలు అన్ని కోట్లు తీసుకుంటారు.. ఇన్ని కోట్లు తీసుకుంటారు అని మాట్లాడుకోవడం ఈజీనే. కానీ, వారు పడే కష్టం ఎవరికి తెలియదు. ఒక పాత్ర కోసం వారు చేసే రిస్క్ ఎవరికి తెలియదు. పాత్ర కోసం బరువు తగ్గాలంటే తగ్గాలి. పెరగాలి అంటే పెరగాలి. జుట్టు పెంచమంటే పెంచాలి. చివరకు గుండు చేయించుకోవాలంటే గుండు చేయించుకోవాలి.

ఇలా.. తెరపై స్టైలిష్ గా కనిపించే హీరో వెనుక ఎన్నో రిస్క్ లు ఉంటాయి. అలా రిస్క్ లు చేసే సమయంలో చాలామంది హీరోలు గాయాలపాలు కూడా అయ్యారు. దెబ్బలు తగిలించుకుంటారు. బాహుబలి సినిమాలో జరిగిన ప్రమాదం వలన ఇప్పటికీ ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు.

ఇక తాజాగా రవితేజకు షూటింగ్ లో గాయాలు అయిన విషయం తెల్సిందే. మిస్టర్ బచ్చన్ తరువాత రవితేజ తన 75 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో రవితేజకు కుడిచేతికి గాయం అయ్యింది. ఆ గాయాన్ని సైతం లెక్కచేయకుండా షూటింగ్ చేయడంతో.. నొప్పి మరింత తీవ్రతరం అయ్యింది. దీంతో వెంటనే రవితేజను హాస్పిటల్ కు తరలించగా.. వైద్యులు సర్జరీ చేశారు.

సర్జరీకి ముందు హాస్పిటల్ బెడ్ పై రవితేజ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. కుడిచేతి నుంచి రక్తం కారుతూ.. ఫేస్ కు మాస్క్ పెట్టి.. రవితేజ స్పృహ లేకుండా కనిపించాడు. ఈ ఫోటోను చూస్తే ఎవరికైనా మనసు చివుక్కుమనక మానదు. అయితే ఇది రవితేజ ఒరిజినల్ ఫోటో కాదని, టచ్ చేసి చూడు సినిమాలోని ఫోటో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఇక రవన్న త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *