సదాశివపేట మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న- బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

Spread the love

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో సదాశివపేట మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో మునుముందు ప్రజలకు సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడిన అభివృద్ధి జరుగుతుందని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఆడపడుచులకు మరియు పట్టణ ప్రజలకు బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధికి సంపూర్ణంగా కలిసికట్టుగా నిలబడతామని తెలియజేశారు. ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో సదాశివపేట మున్సిపల్ సిబ్బంది, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ ప్రముఖులు మరియు ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *