అమరావతికి వరల్డ్ బ్యాంకు భారీ రుణ సాయం..! ఎంతంటే..?

Spread the love

అమరావతి నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకులు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు అభివృద్ధిలో భాగంగా మొదటి దశకు 1.6 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 13,600 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకుతోపాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు అంగీకరించినట్లు ఏపీ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.

 

అమరావతి తొలి దశ అభివృద్ధికి అవసరమైన రూ.15వేల కోట్లలో మిగిలిన రూ.1400 కోట్లను కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఈ ఐదేళ్లల్లో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందనున్నట్లు తెలుస్తోంది.

 

కేంద్రం నుంచి సైతం సహకారం అందడంతో డిసెంబర్ నుంచి పనులు ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. నిధులు విషయంలో కేంద్రం పూర్తి సహకారం ఉండడంతో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి టెండర్లు సైతం రెడీగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *