అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ..?

Spread the love

తెలుగుదేశం పార్టీకి పోటీగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ ఏదో ప్లాన్ చేసింది. ఎందుకంటే, స్టే ట్యూన్డ్ ఫర్ అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సరిగ్గా ఇదే సమయానికి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఉండటం బిగ్ సెన్సేషన్ కి దారి తీస్తోంది. దీంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాడు, ఎవరి కోసం పెడుతున్నాడు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అన్న విషయాల మీద అంతా ఫోకస్ పెట్టారు.

 

వైసీపీకా లేక టీడీపీకా…

 

ఒక దశలో వైసీపీకి అనుకూలంగా ప్రెస్ మీట్ పెడుతున్నాడా అన్న సందేహం ఇటు పార్టీలకు, అటు జనాల్లోకి వెళ్లడం గమనార్హం.

ఇక తన మామ మెగా బ్రదర్ అయిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వానికి అల్లుడు అల్లు అర్జున్ ఝలక్ ఇవ్వబోతున్నాడా ఏంటి అన్న టాక్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోందట.

 

అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆసక్తికరం…

 

కాబట్టి వైసీపీ, టీడీపీ ఇలా ఉన్నఫలంగా బ్రేకింగ్స్ అని చెప్పడం, అదే టైమ్‌లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇలా ఒకదాని వెంట మరొకటి అంశాలతో ఆసక్తికర చర్చ ఊపందుకుంది.

 

మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది…

 

ఇటీవలే ఈ స్టార్ హీరో వ్యక్తిగతంగా నంద్యాల పర్యటన అని చెప్పి కోర్టును ఆశ్రయించడం కొసమెరుపు. మరోవైపు ‘పుష్ప 2’ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. దీంతో మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందోనని టాలీవుడ్ సినీ ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్, పొలిటికల్ అనలిస్టులను ఉత్కంఠతకు గురిచేస్తోంది.

 

వైసీపీ బిగ్ రివీల్ ఎందుకు…

 

అయితే, మొదట బిగ్ బ్రేకింగ్ అంటూ తెలుగు దేశం పార్టీ పోస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీడీపీలో చేరుతున్నారా అని కొందరు అనుకుంటున్నారు. ఇంతలోనే కాదు కాదు, వైసీపీ కూడా బిగ్ రివీల్ అని పెట్టింది కాబట్టి ఆ పార్టీలోనే చేరుతున్నాడు కాబోలు అని మరికొందరు అంటున్నారు. ఇంతకు ఏం జరుగుతుందో తెలియాలంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆగాల్సిందే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *