పోలవరం ప్రాజెక్టుకు కొత్త డెడ్‌లైన్..

Spread the love

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. జలశక్తి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌కి సమాధానంగా కీలక వివరాలు వెల్లడించారు. అనేక ప్రభుత్వాలు వచ్చినా పోలవరం నిర్మాణానికి ఏమీ చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చ్చాక రూ. 15 వేల కోట్లు కేటాయించి పనులు మొదలుపట్టామి కేంద్రమంత్రి తెలిపరాు.

 

ఈ ఏడాది పోలవారానికి రూ. 12 వేల కోట్లకుపైగా కేటాయించామని కేంద్రంమత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. పోలవరం పూర్తయితే 2.91 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని చెప్పారు. విశాఖ నగరం, మరో 540 గ్రామాలకు తాగునీరు లభిస్తుందన్నారు. పోలవరం పూర్తయితే మొత్తంగా 28.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ వివరించారు.

 

జలవనరుల శాఖపై రాష్ట్ర మంత్రి సమీక్ష

 

వేసవి కాలం వస్తున్న క్రమంలో జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయకట్టు, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు.

 

నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు సాగునీరు సరఫరాపై ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.

 

రబీ సీజన్ ముగుస్తుండడంతో ఎస్ఈ స్థాయి అధికారుల నుంచి ఈఈ లు, డీఈఈ లు, ఏఈఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ని్మల రామానాయుడు ఆదేశించారు. రబీ పంటకు రానున్న 10, 15 రోజుల్లో రైతులకు సాగునీరు అందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. కాలువల పూడికలు, తూడు, లాకుల మరమ్మతులు వంటి సమస్యలను అధిగమించి రైతుల పంటను కాపాడాలని సూచించారు.

 

మరోవైపు, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. మార్చి 25వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణకు శ్రీకారం చుట్టి, 2 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 కోట్ల ఎకరాల భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 2 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములున్నాయని తెలిపారు. బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని ఎకరాలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *