తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు తెల్ల రేషన్ కార్డు కావాల్సిందే. ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ కోసం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే అర్హులకు కార్డులు లేని పక్షంలో ప్రత్యేక కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పథకానికి తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రత్యేక భద్రతా కార్డులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు.