సస్పెన్స్ థ్రిల్లర్‌గా సుహాస్ ‘ప్రసన్న వదనం’ ట్రైలర్…

Spread the love

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు హీరో సుహాస్. ఇటీవల కాలంలో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.

 

కొత్త దర్శకుడు అర్జున్ కు హీరో సుహాన్ అవకాశం ఇచ్చి.. ప్రసన్న వదనం అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ అందించారు.

 

గురువారం రాత్రి ప్రసన్న వదనం ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఈ సినిమాతో సుహాస్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమానలో సుహాస్ ఫేస్ బ్లైండ్ నెస్ అనే జబ్బుతో కనిపించన్నాడు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్.. సినిమాపై భారీ అంచనాలనే కలిగిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు త్వరలోనే రానుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *