రాష్ట్ర ప్రభ్యత్వం తిరుపై మండి పడుతున్న ఖమ్మం జిల్లా తల్లంపాడు బెస్తలు …???
కులగననలో మేమేక్కడ…?
ప్రభుత్వానికి మేము కనిపించడం లేదా మా లెక్క ఎంత…?
ఇది ప్రభుత్వం కుట్రనా లేకపోతే బెస్తలు అంటే లెక్కలేదా…?
లేక అధికారుల అసమర్ధతన…?
బెస్త గుండ్ల కులాల పేర్లు జాబితాలో లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఖమ్మం జిల్లా బెస్త తల్లంపాడు బెస్తలు
స్టేట్ బ్యూరో దేశబోయిన సంపత్ కుమార్ గంగపుత్ర ప్రత్యేక కధనం
ఏప్రిల్ 16 (సంచలన వార్త)
కులగననలో మేము ఎక్కడ తెలంగాణ గంగపుత్ర సంఘం అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గంగపుత్ర బెస్త గుండ్ల కులాల పేర్లు జాబితాలో లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన
బీసీ-ఏ జాబితాలో అధికారికంగా గంగపుత్ర, బెస్త, గుండ్ల కులాల పేర్లు ఉన్నప్పటికీ, ఇటీవల సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించిన జాబితాలో మా కులాల పేర్లు పొందుపరచకపోవడం పట్ల మేము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాము.
ఉపకులాల పేర్లు మాత్రమే పేర్కొని, మా ప్రధాన కులాల పేర్లను జాబితాలో ప్రచురించకపోవడం ఎంతవరకు సమంజసం? ఇది నిర్లక్ష్యమా, వివక్షమా అనే ప్రశ్నకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది సంఖ్యలో ఉన్న గంగపుత్ర, బెస్త, గుండ్ల సమాజాలను ఇలా విస్మరించడం అత్యంత దురదృష్టకరం. ఈ విషయాన్ని తక్షణమే బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి, సరైన వివరణతో పాటు సవరణ జాబితాను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
మా కులాల పేర్లను వెంటనే అధికారిక జాబితాలో స్పష్టంగా చేర్చి, సమాజానికి న్యాయం చేయాలి.
జై బెస్త జై గుండ్ల జై గంగపుత్ర
ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘము, 51/56