అంబేద్కర్ ని అవమానించిన సర్పంచ్*

Spread the love

*అంబేద్కర్ ని అవమానించిన సర్పంచ్*

(మఠంపల్లి ఏప్రిల్ 16 సంచలన వార్త సూర్యాపేట జిల్లా బ్యూరో)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని హనుమంతులగూడెం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హనుమంతుల గూడెం గ్రామం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి గత కొన్ని సంవత్సరాల నుండి మొదలుకొని మొన్న జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి కార్యక్రమం నిర్వహించకుండా అంబేద్కర్ ని అవమానించడం జరిగిందని ఇట్టి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని స్థానిక యువకులు,యువజన సంఘం నాయకులు,విద్యావంతులు, చైతన్యవంతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. గ్రామంలో డబి ఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అంబేద్కర్ ని అవమానించడం చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తామని లేదంటే అంబేద్కర్ విగ్రహం అలానే ఉండాలని హుకుం జారి చేయడం అందుకు ఆయన అనుచర వర్గం కూడా వంత పాడడం చాలా బాధాకరమైన మొన్న జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా హనుమంతులగూడెంలో చాలా పెద్ద అంబెడ్కర్ స్టాచ్ ఉన్నప్పటికీ ఫోటోలు పెట్టి కార్యక్రమం జరుపుకోవడం చాలా బాధాకరమైన సంఘటన అని ఇట్టి విషయంపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ హుజూర్నగర్ ఆర్డిఓ మఠంపల్లి ఎమ్మార్వో , మఠంపల్లి ఎంపీడీవో, మఠంపల్లి ఎంపీఓ, హనుమంతులగూడెం గ్రామ సెక్రెటరీ మొదలైన అధికారులు స్పందించి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉండి కూడా ఫోటోలతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇట్టి విషయంపై విచారణ జరిపించి అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హనుమంతుల గూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళితులు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ సామాజిక వర్గ సమస్త ప్రజలు డిమాండ్ చేశారు.