మానవత్వం చాటుకున్న ఖమ్మం డీసీహెచ్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ – కష్టకాలంలో ఆదుకున్న ఆపద్బాంధవుడు
సంచలన వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో….. ఏప్రిల్ 27…
ఖమ్మం…పదవి, హోదా వచ్చాక మనుషులను మరిచిపోతున్న ఈ రోజుల్లో, పదవికే వన్నె తెచ్చేలా మానవత్వం చాటుకున్నారు ఖమ్మం డీసీహెచ్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్. నేలకొండపల్లి మండలం అనంతనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు రాము మరణించారనే వార్త వినగానే, ప్రస్తుతం ఖమ్మం డీసీహెచ్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి చలించిపోయి, దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని గ్రహించి, ఉన్నతాధికారిననే భేషజాలు లేకుండా, ఎవరికీ చెప్పకుండా తన సొంత ఖర్చులతోనే మృతదేహాన్ని ఖమ్మం నుండి స్వగ్రామమైన అనంతనగర్‌కు తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. “పదవిలో ఉంటేనే సేవ చేయాలని లేదు, మనిషిగా స్పందించాలి” అని డాక్టర్ రాజశేఖర్ గౌడ్ చేసిన ఈ పని చూసి అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. కష్టకాలంలో ఆదుకున్న డాక్టర్ రాజశేఖర్ గౌడ్‌కు కుటుంబ సభ్యులు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత పదవిలో ఉండి కూడా ఇంతటి మానవత్వం చూపిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్‌ను పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, స్థానిక ప్రజలు మనసారా అభినందించారు. కాగితాల మీద సంతకాలు పెట్టే అధికారిగా కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టం తీర్చే నాయకుడిగా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ నిలిచారని, ఇలాంటి అధికారులే వ్యవస్థకు అవసరమని వారు కొనియాడారు…