* బెదిరింపులకు పాల్పడుతున్న గ్రామ సర్పంచ్*
*
ఖమ్మం జిల్లా, ప్రతినిధి మార్చి 18, (సంచలన వార్త)
ఇటీవల కాలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో సర్పంచిగా గెలిచిన ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం లక్ష్మీపురం (రాళ్లబంజారా) గ్రామ సర్పంచ్ భూక్య రవీంద్ర నాయక్ గెలిచిన కొద్ది కాలంలోనే ఆ గ్రామ ప్రజలను తన అధికారం తో బెదిరింపులకు పాల్పడుతూ బెదిరింపుల తో ఆగకుండా గ్రామ సభల్లో సమస్యలపై అడిగిన రైతుల పై భౌతికంగా సర్పంచ్ భూక్య రవీంద్ర నాయక్ వారి కుటుంబ సభ్యుల తో రైతుల పై రాళ్లతో దాడి చేయడం జరిగింది. గ్రామ సభలో నిర్వహిస్తున్నప్పుడు ఆ గ్రామ సర్పంచ్ భార్య కూడా అందరిమీద అధికారికమైన పెత్తనం చెలాయించడం అక్కడున్న కొంతమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతటితో ఆగకుండా దాడికి గురైన వారి పక్షాన ఎవరైనా సాక్ష్యం చెప్పినట్లయితే వాళ్ల రేషన్ కార్డు తొలగిస్తానని, రేషన్ రానివ్వకుండా చేస్తానని బెదిరింపులకు సర్పంచ్ పాల్పడడం జరుగుతుంది. ఇంతటితో ఆగకుండా ఐకెపి సెంటర్లు నడుపుతున్న వాళ్లని ఈ ఐకెపి సెంటర్లు మా వాళ్ళకి కావాలి మీ ఐకెపి సెంటర్లను రద్దు చేపిస్తాం అని అదే గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్లను గ్రామ దీపిక కలను బెదిరింపులకు గురి చేస్తున్నాడని సర్పంచ్ పై కొంతమంది. గ్రామ బాధితులు ఖమ్మం జిల్లా కలెక్టర్ కు వినతిపత్ర రూపంలో అందించి వారి యొక్క సమస్యలను వివరించడం జరిగింది. అదేవిధంగా తనపై సత్వరమే విచారణ చేపించి తగు చర్యలు తీసుకోవాలని మర్యాదపూర్వకంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది