పాఠశాలలో క్విజ్ కాంపిటీషన్ పెట్టి బహుమతులు ఇచ్చిన పూర్వ విద్యార్థి విజయ్
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 15 సంచలన వార్త:
డోర్నకల్ మండలం వెన్నారం పాఠశాలలో పూర్వ విద్యార్థి శాతరాజు పల్లి విజయ్ విద్యార్థులు మరింత విద్యావంతులు కావాలని ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు సురేష్ సహాయంతో పాఠశాలలో క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి ఆగస్టు 15న మొదటి బహుమతి షీల్డ్,రెండో బహుమతి డిక్షనరీ,మూడవ బహుమతి కంపాస్ బాక్స్ విద్యార్థులకు అందజేశారు. గ్రామ యువత సహకరిస్తే ప్రతినెల విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు.