రక్తదాతలే నిజమైన ప్రాణదాతలు..!* *నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం* రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఖమ్మం జిల్లా డీసీహెచ్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్.

Spread the love

*రక్తదాతలే నిజమైన ప్రాణదాతలు..!*

*నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం*

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఖమ్మం జిల్లా డీసీహెచ్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్.

*రక్త దానం చేసిన ప్రముఖ జర్నలిస్ట్ అవుట మధు*

, నేలకొండపల్లి,ప్రతినిది (జూలై 28):సంచలన వార్త
రక్తదానం.. ప్రాణరక్షణకు మహాదానం అనే సందేశాన్ని చాటుతూ నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం సేవాభావానికి ప్రతీకగా నిలిచింది.
ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ మంగళ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని ఖమ్మం జిల్లా డీసీహెచ్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తమే ప్రాణాధారమని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు.

శిబిరంలో చెన్నారం గ్రామానికి చెందిన విద్యావంతుడు జర్నలిస్ట్ అవుట మధు రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన రక్తం మరొకరి గుండెల్లో ఆశను నింపుతుంది. మన చిన్న సేవ ఒక కుటుంబంలో పెద్ద సంతోషాన్ని తీసుకొస్తుంది. రక్తదానం చేసిన ప్రతిఒక్కరు ఒక ప్రాణాన్ని కాపాడిన ప్రాణదాతే. యువత ముందుకొచ్చి నిరంతరం రక్తదానం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, డాక్టర్ రాజేష్, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మాదాసు ఆదాం, సీవీఆర్ పాలేరు రిపోర్టర్ దుడ్డెల సంజయ్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు.రక్తం ఇస్తే తగ్గేది కాదు పెరిగేది మానవత్వం. రక్తదానం చేస్తే నిలిచేది పేరు కాదు నిలిచేది ఒక ప్రాణం అంటూ వైద్యులు, నిర్వాహకులు ప్రజలకు అవగాహన కల్పించారు.