‘టక్‌ జగదీష్‌’ మూవీపై వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటోంది చిత్ర బృందం

Spread the love

‘టక్‌ జగదీష్‌’ మూవీపై వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటోంది చిత్ర బృందం. నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’ ..’నిన్నుకొరి’, ‘మజిలీ’ చిత్రాలతో టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్న చితృ బృందానికి కరోనా బ్రేక్ వేసింది. ఇక ప్రస్తుతం లాక్‌డౌన్‌ ముగిసి, థియేటర్లు తెరచుకునేందుకు అనుమతి లభించడంతో,’టక్‌ జగదీష్‌’ జూలై చివరివారంలో రిలీజ్ చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో తాజాగా చిత్రబృందం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మూవీ విడుదలకి సంబంధించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ పేర్కొన్నారు. విడుదల తేదీ కన్‌ఫర్మ్ అవగానే స్వయంగా మేమే ప్రకటిస్తారని తెలిపారు. కాగా ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *