“కాకినాడ జిల్లా తుని లో చికెన్ బిర్యానికి బదులుగా బొద్దింకల బిర్యానీ కలకలం…???
” ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని తుని శివ శక్తి రెస్టారెంట్ కీ వొచ్చాడు సగం బిర్యానీ తినేలోగా అందులో బొద్దికని చూసి షాక్…!!!
” కస్టమర్‌కు అందుబాటులోకీరాణి ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్…!!!
” హోటల్ యజమాని మాత్రం అదే బొద్దినకల బిర్యానీ ని ఇంకా అందరికి సప్లై చేస్తూనే వున్నాడు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది …!!!
” ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ రెస్టారెంట్ ని తనిఖీ చేసి చెర్యలు తీసుకోని ప్రజల ప్రాణాలకీ భరోసా కలిగించాలని పలువురు కోరుకుంటున్నారు…
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం ఆగష్టు 12 (సంచలన వార్త)
ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని రెస్టారెంట్‌కు వచ్చాడు. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యానీ వచ్చిన వెంటనే తిందామని చూసిన కస్టమర్‌కు అందులో కనబడింది చూసి షాక్‌కు గురయ్యాడు.
ఆహార నాణ్యత విషయంలో హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు తమ తీరును మార్చుకోని పరిస్థితి. పలు మార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి ఫుడ్ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని అనేక హోటళ్లను సీజ్‌లు కూడా చేశారు. కొద్ది రోజులు ఫుడ్ సేఫ్టీ అధికారుల హాడావుడి నడిచినా.. మళ్లీ షరామామూలే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. డబ్బు సంపాందించడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరు.. కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చిరించినా, హోటళ్లను సీజ్ చేసినా వారి బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు.
ఫుడ్ తయారీలో ప్రాణాంతక రసాయనాలు వాడటం, ఎక్స్‌పైరీ అయిన పదర్థాలు ఉపయోగించడం చేస్తున్నారు. అంతే కాకుండా ఆహారంలో పురుగులు, బొద్దింకలు రావడం కూడా మామూలైపోయింది. తాజాగా కాకినాడ జిల్లాలో తుని శివ శక్తి రెస్టారెంట్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆగష్టు 12 బిర్యానీ తినాలని శివ శక్తి రెస్టారెంట్‌కు వెళ్లారు. ప్లేట్‌లో ఉన్న బిర్యానీని తిందామని చూడగా అక్కడ కనిపించింది చూసి అవాక్కయ్యారు. ఫుడ్ తయారీలో హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం పట్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది.. బిర్యానీలో ఏం బయటపడిందో దృశ్యాలు చుడండి అని ఇన్స్పెక్టర్ కి పలుమార్లు కాల్ చేసినప్పటికీ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఆ యజమాని మాత్రం ఆగకుండా అదే బిర్యానీ సప్లై చేస్తున్నారు చూడాలి ఇంకా అధికారులు ఎం చేస్తారో…
(వేచి చుడండి సంచలన వార్త తుని లో బొద్దినకల బిర్యానీ మరో సంచలనాత్మక కథనంతో మీ ముందుకి త్వరలో)