వెన్నారంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 15 సంచలన వార్త:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయులను త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత,సమగ్రత గుర్తు చేశారు.గ్రామంలో గ్రామపంచాయతీలో సర్పంచ్ జక్కుల కౌసల్య,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బోయినపల్లి నాగేశ్వరరావు,పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సురేష్ జండా ఎగరవేశారు.పాఠశాలలో విద్యార్థులకు యోగ క్లాసులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి,ఉప సర్పంచ్ వట్టే మల్లయ్య,వార్డు మెంబర్లు,గ్రామ నాయకులు తాళ్లపల్లి రాము,బత్తిని ఉపేందర్,బోయినపల్లి వెంకన్న,కడెం బిక్షం,కాసర్ల శ్రీను,ఆకుతోట వెంకన్న, మాడేటిపాటి సతీష్,యూత్ నాయకుడు కడెం నాగరాజు, అంగన్వాడి టీచర్స్,ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ యువత పాల్గొన్నారు.