*ఆరు బయట చెత్త వేయరాదు – మొక్కలు నాటండి ప్రకృతిని కాపాడండి.* హైదరాబాద్ గచ్చిబౌలి :- ఆగష్టు 15 (సంచలన వార్త) శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గల ఖాజా గూడా లో మొక్కలు నాటే కార్యక్రమంను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేర్లింగంపల్లి సర్కిల్ 225, ఎస్ఆర్పి కృష్ణయ్య,శానిటేషన్ సూపర్వైజర్లు అనిల్ కుమార్, తిమ్మప్ప ఆధ్వర్యంలో రోడ్లమీద చెప్తా వేస్తున్నారని దాని నివారించేందుకు మొక్కలు నాటక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్, బిఆర్ఎస్ పార్టీ శేర్లింగంపల్లి సీనియర్ నాయకులు కొమురశెట్టి సాయిబాబా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్త సేకరణ బండ్లు వీధుల్లోకి వచ్చినప్పుడు ఇంట్లో పేరుకుపోయిన చెత్తను వారికి అందించాలని సూచించారు. రోడ్ల మీద చెత్త వేయడం వల్ల పరిసరాలతో పాటు ప్రాంతం కూడా దుర్వాసన చెందుతూ అనేక రోగాలు వస్తాయని ఆయన అన్నారు. పరిసరాలతో పాటు మన ఆరోగ్యాలను కాపాడుకోవాలంటే అందరు కూడా సిఎంసి అధికారులకు సహకరిస్తూ చెత్త సేకరణ వారికి ప్రతిరోజు చెప్పిన అందించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలతో పాటు జిహెచ్ఎంసి శానిటేషన్ కార్మికులు రమేష్,యాదమ్మ,శమంతా,బల్లమ్మ,రాంకీ ఏరియా సూపర్వేజర్ రాజకుమార్ లు పాల్గొన్నారు.