ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పై అసత్య ప్రచారాలు సరికాదు

Spread the love

ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పై అసత్య ప్రచారాలు సరికాదు

వెన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి రాము
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు27 సంచలన వార్త:
డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పై సోషల్ మీడియావేదికపై బిజెపి నాయకులు నరేష్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని డోర్నకల్ మండల వెన్నారం గ్రామకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి రాము మండిపడ్డారు.రామచంద్రనాయక్ ఎప్పుడు కార్యకర్తల గురించి ఆలోచించే వ్యక్తి కానీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్పడం సరికాదన్నారు.పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే భేదాలు ఎటువంటివి లేవని పదవుల కోసం పోటీ ఉన్న సమయంలో సర్ది చెప్పి పరిష్కారం చెప్పే వ్యక్తి రామచంద్రనాయక్ అని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లేని అభివృద్ధి కార్యక్రమాలు డోర్నకల్ పట్టణంలో ఇప్పుడు జరుగుతున్నాయని అది గమనించి మాట్లాడాలని అన్నారు.ఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బదులిచ్చారు.బిజెపి పార్టీని ప్రజలలోకి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచించాలి కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు సరికాదన్నారు