ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో
ఘనంగా ఖేల్ కి బాత్ పీఎం కే సాథ్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 27 సంచలన వార్త:
యువజన వ్యవహారాల శాఖ, యువజన వ్యవహారాలు,క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల( అటానమస్ )నందు ఘనంగా కేలో ఇండియా సంవాద్- ఖేల్ కి బాత్ పీఎం కే సాత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్యహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి యువత ను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగం ఇచ్చారు.డాక్టర్ మనస్సుఖ్ మాండవ్య (యూత్ అఫ్ఫైర్స్, స్పోర్ట్స్ మినిస్టర్) ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశాన్ని ఆరోగ్యవంతమైన క్రమశిక్షణ కలిగిన క్రీడా స్ఫూర్తితో కూడిన దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.అనంతరం స్థానిక క్రీడాకారులు మైథిలి, నగేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.అనంతరం యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నషా ముక్త్ ప్లెడ్జ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భానోత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రామారావు,మై భారత్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ రాంబాబు,కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కే కవిత, రామ కుమారస్వామి,కళాశాల అధ్యాపకులు, బోధన,బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.