వన సంరక్షణ సమితులకు రూ.1.18 కోట్ల రెవెన్యూ షేరింగ్ చెక్కులు పంపిణీ. గిరిజనుల అవసరాలకు అటవీ శాఖ సహకారం అందించాలని సూచన… పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు

Spread the love

వన సంరక్షణ సమితులకు రూ.1.18 కోట్ల రెవెన్యూ షేరింగ్ చెక్కులు పంపిణీ.

గిరిజనుల అవసరాలకు అటవీ శాఖ సహకారం అందించాలని సూచన…
పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు

జీలుగుమిల్లి, సెప్టెంబర్ 16(సంచలన వార్త )…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితుల (వీఎస్ఎస్) రెవెన్యూ షేరింగ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం జీలుగుమిల్లి మండలంలోని కనకాపురం వద్ద ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముందుగా కనకాపురం గ్రామ జనసేన అధ్యక్షుడు శొంఠి రామకృష్ణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం జరిగిన చెక్కుల పంపిణి కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్ పరిధిలోని కనకాపురం రూ 46,16,006,జిల్లెల్లగూడెం రూ 30,17,270,బుట్టాయగూడెం మండలంకు చెందిన వెలుతురువారిగూడెం రూ 42,62,265 వీఎస్ఎస్ లకు కలిపి మొత్తం రూ.1,18,95,541 రెవెన్యూ షేరింగ్ మొత్తాన్ని ఎమ్మెల్యే చెక్కుల రూపంలో అందజేశారు. గతంలో సాగు చేసిన యూకలిప్టస్ తదితర తోటల ద్వారా వచ్చిన ఆదాయంలో నిబంధనల ప్రకారం వీఎస్ఎస్ లకు రావాల్సిన వాటాను ఈ చెక్కుల ద్వారా పంపిణీ చేశారు. అడవుల సంరక్షణలో వీఎస్ఎస్ సభ్యుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొనియాడారు. అడవులను కాపాడటం, మొక్కలు పెంచడం, అగ్ని ప్రమాదాలను నివారించడంలో మీరు అటవీ శాఖకు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ నిధుల విడుదలకు కృషి చేసిన డి ఎఫ్ ఓ పి సందీప్ రెడ్డి, అటవీ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ డబ్బును పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు వాడకుండా, కొంత మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కేటాయించాలని సూచించారు. గ్రామంలో పాఠశాల అవసరాలు, తాగునీటి సౌకర్యాలు, బస్ షెల్టర్లు వంటి మౌలిక వసతులకు ఉపయోగిస్తే గ్రామానికే మేలు జరుగుతుందని తెలిపారు.అడవులపై ఆధారపడి జీవించే గిరిజన ప్రజల అవసరాలను అటవీ శాఖ అర్థం చేసుకోవాలన్నారు.దేవాలయాల సంప్రదాయ కార్యక్రమాలు, గ్రామాల్లో శుభకార్యాలు, ముఖ్యంగా గిరిజన కుటుంబాల వివాహా సమయంలో అవసరమైన సాధారణ అటవీ వనరులకు నిబంధనల ప్రకారం వెసులుబాటు కల్పించాలని ఆయన సూచించారు.అనంతరం కనకాపురం ఎంపీయుపి పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి భవిష్యత్ తరాలకు పచ్చని భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చెట్లు, నీరు, వర్షపాతం, జీవ వైవిధ్యం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక చెట్టు తొలగిస్తే రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం డి ఎఫ్ ఓ పి వి సందీప్ రెడ్డి, మాట్లాడుతూ కొన్ని వీఎస్ఎస్ లకు ఖాతాల నిర్వహణ సమస్యలు, వ్యక్తిగత మరియు ఉమ్మడి ఖాతాలపై స్పష్టత లేకపోవడంతో నిధుల విడుదల ఆలస్యమైందని అన్నారు.ఇప్పుడు నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేసి విడుదల చేస్తున్నామని, పెండింగ్ లో ఉన్న ఇతర వీఎస్ఎస్ నిధులను కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ డి ఎఫ్ ఓ వెంకట సుబ్బయ్య, ఎఫ్ ఆర్ ఓ వి. దుర్గాకుమార్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎ ఏం సి చైర్మన్ పొట్టా రామారావు, కూటమి నాయకులు ఉండవల్లి సోమసుందరం, బండారు అనిల్ కుమార్, సుంకవల్లి సాయి, నాలి శ్రీనివాస్, రూపా సత్యనారాయణ, కొప్పుల శ్రీకాంత్, శొంఠి రామకృష్ణ, పద్దం వెంకటకృష్ణ, కుంజా రమేష్, వీరంకి వెంకటేశ్వరరావు, చిర్రి నాగరాజు, వి ఎస్ ఎస్ అధ్యక్షులు పాయం వీరస్వామి, ఉపాధ్యక్షులు కొప్పుల రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.