ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు.*

Spread the love

*ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు.*

మంచిర్యాల బ్యూరో ఏప్రిల్ 11 2026 (సంచలన వార్త)

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ యొక్క వృద్ధాశ్రమం నందు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ…..
ఏప్రిల్ 11/ 1827 న మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిరావు పూలే సమాజంలోని అసమానతలు,కుల వివక్ష,మూఢనమ్మకాలపై వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు.
సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలైన ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజల యొక్క జీవితాలు మారాలంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి, స్త్రీలను విద్యావంతులను చేయడానికి మహారాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలను నెలకొల్పడం జరిగిందనీ తెలిపారు.
మహాత్మ జ్యోతిరావు పూలే “సత్య శోధక్ సమాజ్” స్థాపించి సమాజంలో ఉన్న కుల అసమానతులను రూపుమాపడానికి అనేక పోరాటాలు చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ మహనీయుని జీవిత చరిత్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్ తరాలకు అందేలా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జుమ్మడి గోపాల్ ,ఎస్ కే సల్మాన్ పాష, జాగిరి రాజేష్, రేగుంట క్రాంతి కుమార్, బచ్చల జశ్వంత్ లు పాల్గొన్నారు.