పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం..
తాడేపల్లిగూడెంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు..!
తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారుల తనిఖీలు..!
స్టేట్ బ్యూరో మార్చి 18 (సంచలన వార్త)
ఒక స్థలంకి సంబంధించి సర్వే రిపోర్టు ఇవ్వడానికి యజమాని వద్ద 50 వేలు డిమాండ్ చేసిన సర్వేయర్ రామకృష్ణ. సర్వేయర్ రామకృష్ణ కి నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.సర్వేయర్ రామకృష్ణ, సర్వే సిబ్బందిని, కుటుంబ సభ్యులను విచారిస్తున్న ఏసీబీ అధికారులు.మున్సిపల్ సర్వేయర్ తో పాటు, ఇంచార్జి డివిజనల్ సర్వేయర్ గా పనిచేస్తున్న రామకృష్ణ. గతం నుంచే సర్వే రామకృష్ణ పై పలు అవినీతి ఆరోపణలు.ఏసిబి అధికారుల దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం.ఏసీబీ దాడులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.