ప్రతి రిజిస్ట్రేష‌న్‌కో రేటు..!!! గన్నవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వసూళ్ళ దందా…?

Spread the love

* ప్రతి రిజిస్ట్రేష‌న్‌కో రేటు..!!!
గన్నవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వసూళ్ళ దందా…?
* గన్నవరం స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో అవినీతి రాజ్యమేలుతోంది. అడిగినంత ఇస్తే కానీ ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కావడం లేదు…?
* ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా ముడుపులను పుచ్చుకుంటున్నారు అని జిల్లాలో గుసగుసలు…?
” జిల్లా అధికారి సీసీ పుటిజ్ చెక్ చేస్తే వసూళ్ళ దందా బట్టబయలు అవుతుంది …!!!
” వ్యవహారమే తెలవదు అంటున్న డిఆర్ పర్యవేక్షణ లేదు అనేది తేటతెల్లం తనిఖీలు శూన్యం…?
* కొన్ని పెద్ద రిజిస్ట్రేష‌న్ల‌పై ఏకంగా రూ.లక్షపైనే దండుకుంటున్న‌ట్లు స‌మాచారం…!!!
* రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఎస్ఆర్వో, సిబ్బంది వాటా ముట్టజెప్పితేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతోంది అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి…!!!
ఈ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డ్ ఇంకా ప్రజలకి సూచనలు చెప్పే బోర్డ్ లు అంటే లెక్కనేలేదు చిత్తు కాగితంలా పడేసారు…

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం 1 మే 19 2026 (సంచలన వార్త)
రిజిస్ట్రేష‌న్‌కో రేటు..!
కృష్ణ జిల్లా గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అన్నీ సక్రమంగా ఉన్నా.. ఏదో ఒక తిరకాసు పెడుతూ రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు, కొన్ని పెద్ద రిజిస్ట్రేష‌న్ల‌పై ఏకంగా రూ.లక్షపైనే దండుకుంటున్న‌ట్లు స‌మాచారం. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఎస్ఆర్వో, సిబ్బంది వాటా ముట్టజెప్పితేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతోంది.
ఎస్ఆర్వో డాక్యుమెంట్ రైటర్లను ఏజెంట్లుగా పెట్టుకొని దందా సాగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. మొత్తంగా పైసలిస్తే కానీ.. పనికావ‌డం లేదు. ప‌ని త్వరగా పూర్తికావాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే.

అసలు ఎలాంటి రిస్క్‌ లేకుండా పేపర్ వర్క్ స్మూత్‌గా అయిపోవాలంటే మ‌ధ్య‌వ‌ర్తుల‌ను సంప్ర‌దించాల్సిందే. ప్ర‌తీప‌నికి రేటు ఫిక్స్ చేసి మ‌రీ కార్యాల‌య అధికారులు మ‌ధ్య‌వ‌ర్తుల‌ను నియ‌మించుకుని అడ్డ‌గోలుగా దండుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా కృష్ణ జిల్లా గన్నవరం స‌బ్ రిజిస్ట్రేస‌న్ కార్యాల‌యంలో మూడు లంచాలు.. ఆరు అక్ర‌మాలుగా అవినీతి వ‌ర్ధిల్లుతోంది. కార్యాల‌యంలో వివిధ సేవ‌ల‌కు స‌మ‌య‌పాల‌న అంటూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు గరిష్టంగా 24 గంటల సమయం పడుతుండగా, కంప్యూటరైజ్డ్‌ ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీకి గంట, అలాగే ఈసీ నకలు మ్యానువల్‌గా ఇచ్చేందుకు 24 గంట లు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు గంట, పెండింగ్‌ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఒక రోజు, పెండింగ్‌ డాక్యుమెంట్లు సెక్షన్‌ 47-ఏ కింద జారీ చేసేందుకు 7 రోజులు, భూముల మార్కెట్‌ వాల్యువేషన్‌ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు గంట సమయం కేటాయిస్తూ సిటిజన్‌ చార్టులో పేర్కొంట్టారు . అయితే ఇవ్వన్ని నామమాత్రమే. అదనంగా ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుతాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వ‌స్తోంద‌ని గన్నవరం వాసులు పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం.
చేయి త‌డ‌పాల్సిందే..!
కృష్ణ జిల్లా గన్నవరం కేంద్రంలో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. వీటిల్లో కొన్నింటికి ఎటువంటి అనుమతులులేవు. ఇది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులకు కాసులు కురిపిస్తోంది. ప్లాట్‌కు రూ.10 వేలు 20 వేలు ఒక లక్ష ఇస్తే చాలు, అభ్యంతరాలు లేకుండా,నిబంధనలను తుంగలో తొక్కి, ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. కార్యాలయంలో చేయి తడపందే ఏ పనీ జ‌ర‌గ‌డం లేదు. అని జిల్లాలో గుసగుసలు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ రేజిస్ట్రేషన్లు చేస్తూ వసూళ్ళకి తెగబడుతున్న రిజిస్టర్ పై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్న కృష్ణ జిల్లా గన్నవరం ప్రజలు…
(వేచి చుడండి సంచలన వార్త గన్నవరం సబ్ రిజిస్టర్ అక్రమ వసూళ్ళ వివరాలు త్వరలో ఎపిసోడ్ 2 మీ ముందుకు )