మానవత్వం చాటుకున్న ఖమ్మం జిల్లా డి సి హెచ్ ఓ రాజశేఖర్ గౌడ్…
ప్రజాదర్బార్ కీ వెళ్తుండగా మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగిందని చూసి హాస్పిటల్ కు తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసిన రాజశేఖర్ గౌడ్
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిది మే 3 (సంచలన వార్త)
ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్తున్న ఖమ్మం డి.సి.హెచ్.ఓ. డాక్టర్ రాజశేఖర్ గౌడ్ మానవత్వం చాటుకున్నారు. తిరుమలాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆవుల ప్రవీణ్ అనే యువకుడిని గమనించి, స్వయంగా ప్రథమ చికిత్స అందించి తిరుమలాయపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపే వివాహం ఉన్న యువకుడిని సకాలంలో ఆదుకున్న డాక్టర్స్ ని స్థానికులు అభినందించారు.