వి.కోట మండలం యడగురికి గ్రామశివార్‌లో 14 ఏనుగుల గుంపు హల్‌చల్

Spread the love

చిత్తూరు: జిల్లాలోని వి.కోట మండలం యడగురికి గ్రామశివార్‌లో 14 ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తోంది. గ్రామీణ రహదారి పక్కనే ఉంటూ అటు.. ఇటు వచ్చి వెళ్ళే వారిపై ఏనుగుల గుంపు దాడులకు తెగబడుతోంది. మందలో గున్న ఏనుగు పిల్లలు ఉండటంతో జనాన్ని చూసి ఘీకరిస్తూ మామిడి తోటలో తిష్ట వేశాయి. ఏనుగుల గుంపు దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుంపు దాడితో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఆగని వరుస దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *