ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి.
ఆసిఫాబాద్ ప్రతినిది జనవరి 21.(సంచలన వార్త)
ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, *కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన అత్యంత రెచ్చగొట్టే, అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు జిల్లా ఎస్పీ నితిక పంత్ కి ఫిర్యాదు అందజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ద్వేషాన్ని మరియు బెదిరింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, BRS నాయకురాలు మర్సకోల సరస్వతి, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, సర్పంచ్ లు బుర్స పోచయ్య, చూనార్కర్ సతీష్,ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, చిలువేరు వెంకన్న,పొన్నాల నారాయణ, అహ్మద్,నిస్సార్,గంధం శ్రీనివాస్,దూడల అశోక్, గోపాల్,జావీద్, అన్సార్, CH.రవి,సాయి శ్రవణ్, సల్మాన్ ఖాన్,సమాధాన్, శంకర్ సతీష్,తుకారాం, రాకేష్, ధర్మారావు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.