అవకాశం ఇస్తే అభివృద్ధి పరుగులు – ఎల్లావుల సువర్ణ హరికృష్ణ
డోర్నకల్ ప్రతినిది జనవరి 31 (సంచలన వార్త)
మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్ మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఎల్లావుల సువర్ణ హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడాతు. కష్టపడిన వారికే ఫలితం దక్కుతుందనే నమ్మకంతో ప్రజల మధ్యకు వచ్చానని తెలిపారు. వార్డులో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు మార్పు లేకుండా నిలిచిపోయాయని విమర్శించారు. ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు వేగవంతం చేస్తానన్నారు.
ప్రస్తుతం ఆశ వర్కర్‌గా సేవలందిస్తున్న తాను, ప్రజాసేవను మరింత విస్తరించేందుకు అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో వార్డు అభివృద్ధికి అంకితమవుతానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం తనకు బలం అని, ఇదే సంకల్పంతో ముందుకు సాగుతూ 13వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఎల్లావుల సువర్ణ హరికృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్ జైన్. మాజీ సర్పంచ్ మాదా శ్రీనివాస్. మున్నా. పోటు జనార్ధన్. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు