యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ గుడికి విరాళం రాందేని ఫ్యామిలీ అందజేత

Spread the love

యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ గుడికి విరాళం

రాందేని ఫ్యామిలీ అందజేత
డోర్నకల్ ప్రతినిధి జూన్ 22 సంచలన వార్త:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే రాందేని కుటుంబం గంగమ్మ గుడి నిర్మాణానికి రూ.25,000 విరాళాన్ని అందించారు. సోమవారం గుడి కమిటీ సభ్యులు యాదవ సోదరులను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ సహకారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బసవయ్య సావిత్రమ్మ,కుమారులు సురేష్,నరేష్ మాట్లాడుతూ.. యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి గుడి నిర్మాణంలో తాము భాగస్వామ్యులం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద గొల్ల శీలం శ్రీనివాస్, సకినాల వెంకన్న, జాల నరేష్,దాసరి శ్రీనివాస్, కేశ బోయినవెంకటేష్ పాల్గొన్నారు.