తెలంగాణలో స్టాఫ్‌నర్సు పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనున్నారు. తుది మెరిట్ జాబితాపై అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్యారోగ్యశాఖకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.