తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ ఈ నెల 31లోపు ముగియనుంది. రేషన్ కార్డు/ ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. రేషన్ డీలర్ వద్ద ఉండే ఈ పాస్ మెషీన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. కాగా ఆధార్ అప్డేడేషన్ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఈ-కేవైసీ చేసుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మీరు ఈ-కేవైసీ చేయించకపోతే వెంటనే చేయించండి.