పట్టభద్రుల ఓటు నమోదుకు 4,76,220 దరఖాస్తులు..

Spread the love

త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం 4,76,220 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 6తో గడువు తేదీ ముగిసినా ఆన్లైన్లో పట్టభద్రులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆలస్యంగా వచ్చినవాటిపై ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈనెల 22 వరకు కొనసాగనుంది. అనంతరం ఈనెల 24న ఓటరు ముసాయిదా జాబితా, ఏప్రిల్ 4న పట్టభద్రుల తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *