సీఎం జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో రాప్తాడు వేదికగా జరిగే ‘సిద్ధం’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల మేనిఫేస్టోను సీఎం ప్రకటించే అవకాశం ఉంది. వృద్ధులు, వితంతువుల పెన్షన్లను రూ.4 వేలకు పెంచడంతో పాటు రైతు రుణమాఫీ అంశాలు మేనిఫేస్టోలో ఉంటాయని సమాచారం. అలాగే మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.