తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో హైఅలర్ట్..

Spread the love

ఢిల్లీలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కలవరపెడుతున్నాయి. మొన్న ఎయిర్ పోర్ట్, హాస్పిటల్స్, ఇవ్వాళ స్కూల్స్, ఇప్పుడు తీహార్ జైలు ఇలా ఒకదాని తర్వాత ఒకదానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

 

మంగళవారం సాయంత్రం తీహార్ జైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. దీంతో వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. కాల్ తో పాటు జైలుకు మెయిల్ కూడా వచ్చినట్లు పోలీసులు నిర్థారించారు. అయితే జైలులో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువ గుర్తించలేదని జైలు అధికారులు తెలిపారు.

 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు తీహార్ జైలులో విస్తృత తనిఖీలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *