మెట్రో రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త..!

Spread the love

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. సమయ వేళల్లో మార్పులు చేయడంతో ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండగా, ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రైలు రాకపోకలు మొదలు కానున్నాయి.

 

అయితే, మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచి మెట్రో రాకపోకలు కొనసాగిస్తుంటుంది. రైలు వేళల్లో మార్పులు చేయడంతో ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగతా రోజుల్లో ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమైతాయి. అదేవిధంగా రాత్రి సమయంలో చివరి రైలు రాత్రి 11.45 గంటలకు మెట్రో టెర్మినల్ నుంచి అందుబాటులో ఉండనున్నది. పొడిగించిన వేళలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయని మెట్రో అధికారులు పేర్కొన్నారు. అయితే, ఇటీవల రద్దీ పెరగడంతో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉంచితే, గతంలో కూడా పలు మార్పులు చేసి మెట్రో సేవలను పొడిగించిన విషయం తెలిసిందే. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆ నేపథ్యంలో రాత్రి ఒంటి గంటకు కూడా చివరి మెట్రో రైలు రాకపోకలను కొనసాగించింది.

 

మరో విషయమేమంటే.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య 50 కోట్లకు చేరినట్లు యాజమాన్యం ఇటీవలే ప్రకటించింది. ప్రయాణికుల సంఖ్య 50 కోట్లకు చేరడంతో ప్రయాణికులకు మేలు జరిగేవిధంగా మెట్రో రైలు యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకుంది.

 

కాగా, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో సుమారు 69.2 కిలో మీటర్లను కవర్ చేస్తుంది. మొదటి కారిడార్ లో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. రెండో కారిడార్ లో జేబీఎస్ నుంచి ఎమ్జీబీఎస్ కి కలుపుతోంది. ఇగ మిగతా మూడో కారిడార్ లో నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సేవలు అందిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్ ద్వారా 2017 లో ప్రారంభించబడిన ఈ మెట్రో రైలు ఢిల్లీ మెట్రో, బెంగళూరు మెట్రో తరువాత భారతదేశపు మూడవ పొడవైన మెట్రో నెట్ వర్క్ గా అవతరించింది.

 

ఇదిలా ఉంటే.. పౌరుల నుంచి అధిక స్పందన వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ యొక్క ప్రతిపాదిత ఫేజ్ -2 విస్తరణ కోసం కొత్త మార్గాలను ఖరారు చేసి ఆమోదించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు అనుసంధానంగా నగరం నలుమూలల నుంచి మొత్తం 70 కిలో మీటర్ల వరకు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు ప్రాధాన్యతనిచ్చినచ్చింది. భవిష్యత్తులో ప్రజా రవాణా అవసరాలను తీర్చడమే కాకుండా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపిన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *