ముగిసిన పార్లమెంటు.. ఆరో దశ ఎన్నికల ప్రచారం..

Spread the love

నేటితో ఆరో దశ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆరో దశలో భాగంగా 58 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 25న పోలింగ్ జరగనున్నది. ఈ 58 స్థానాల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

 

ఉత్తర్ ప్రదేశ్ – 14, హర్యానా-10, బీహార్-8, పశ్చిమ బెంగాల్ – 8, ఢిల్లీ – 7, ఒడిశా-6 జార్ఖండ్- 4, జమ్మూ అండ్ కాశ్మీర్ -1 లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగనున్నది. భారీ భద్రత నడుమల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

ఈ నెల 25న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. అయితే, ఆరో దశ ఎన్నికల పోలింగ్ లో ఢిల్లీ, హర్యానా సీట్లు ఉండడం విశేషం. పార్లమెంటు ఆరో దశ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. గెలుపుపై ఇటు ఆప్, అటు బీజేపీ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటు చివరి దశ అయినటువంటి పార్లమెంటు ఏడో దశ పోన్నికల పోలింగ్ వచ్చే నెల 1న జరగనున్నది. ఫలితాలు జూన్ 4న రానున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *