వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు..!

Spread the love

పోస్టల్ బ్యాలెట్‌‌లో 90 శాతం ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అందుకే ఆ ఓట్లను తగ్గించుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను టీడీపీ ఏం కోరిందో తెలుసుకోకుండా వైసీపీ ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు అని అన్నారు.

 

టీడీపీ 750 ఫిర్యాదులను చేస్తే వాటిలో కేవలం రెండింటికి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు. తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని అన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై ఎన్నికల సంఘానికి తాము చేసిన ఫిర్యాదును వైసీపీ నేతలు తప్పుగా చిత్రీకరిస్తున్నరని ధ్వజమెత్తారు.

 

పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి తక్కువ ఓట్లు రావడంతోనే కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. తాము ఓడి పోతున్నామన్న సంగతి పైసీపీ నేతలకు ముందే తెలిసిపోయిందన్నారు. అందుకే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వైసీపీ నేతలపై 400కు పైగా కేసులు ఉన్నాయని ఆరోపించారు. కోర్టులంటే వారికి లెక్క లేదని అన్నారు. అనేక అంశాల్లో సుప్రీంకోర్టు సైతం వైసీపీకి మొట్టికాయలు వేసిందని విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన వైసీపీ క్యాన్సర్‌కు మందు జూన్ 4న వస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *