కూటమి అధికారంలోకి వస్తే.. ప్రధాని ఎవరవుతారంటే..?

Spread the love

దేశంలో పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పార్లమెంటు ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా ముగిసిన విషయం తెలిసిందే. రేపు చివరి దశ- ఏదో దశ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. మాకు ఎక్కువ సీట్లు వస్తాయి.. మేమే అధికారంలోకి రాబోతున్నామంటూ ఇటు బీజేపీ అటు కూటమి ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు అంశాలపై కూడా దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అదేమంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారు.? ఇటు కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారు? అంటూ ప్రజల్లో చర్చ కొనసాగుతుంది.

 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని అభ్యర్థిగా తాను రాహుల్ నే సమర్థిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయా మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విధంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాయ్ బరేలీ స్థానం విషయమై కూడా మాట్లాడారు. ఈ స్థానాన్ని ప్రియాంక గాంధీకే కేటాయించాలంటూ తాను ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. అయితే, అక్కడి నుంచి రాహుల్ గాంధీయే పోటీ చేస్తానని ముందుకు రావడంతో ప్రియాంక తప్పుకున్నారంటూ ఆయన తెలిపారు.

 

ఖర్గే వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని, కూటమిలో కీలక పాత్రను పోషిస్తున్న కాంగ్రెస్ కే ప్రధానమంత్రి పదవి దక్కే అవకాశముందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *