ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పందన’ కార్యక్రమాన్ని సమూలంగా మార్పులు చేస్తోంది. ఈ మేరకు ‘స్పందన’ కార్యక్రమాన్ని ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్’గా పునరుద్ధరిస్తూ కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కలెక్టర్లకు ఆదేశాలు..
‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్’ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.