జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్..!

Spread the love

ఏపీలో సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల ప్రకారం.. ప్రముఖ నటి జెత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు విద్యాసాగర్ కు గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం విద్యాసాగర్ ను సాంకేతిక ఆధారాల సాయంతో వేరే రాష్ట్రంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విద్యాసాగర్ తన స్నేహితుడి సెల్ ఫోన్ ను వినియోగించాడని, ఈ క్రమంలో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు సాంకేతికత సాయంతో విద్యాసాగర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

 

కాగా… జెత్వానీ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రముఖ అధికారుల పాత్ర కూడా ఉందంటూ ఆమె ఆరోపించారు. జెత్వానీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను ఏ1గా చేర్చారు. అదేవిధంగా అతనితోపాటు పలువురిపై కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *