నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’..!

Spread the love

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సుమారు రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తుండగా.. దాదాపు 30 వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది.

 

అన్నీ జిల్లాల్లో కలెక్టర్లు గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించి 3 వేల కి.మీ మేర సిమెంట్‌ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు. సాంకేతిక ఆమోదం కోసం ఇంజనీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగే భూమిపూజలో పాల్గొంటారు.

 

అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించగా.. సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటసారిగా చేపట్టనున్న ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *