కాకతీయ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రామచంద్రం గారిని ఘనంగా సన్మానించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

Spread the love

వరంగల్ జిల్లా, కాకతీయ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వి.రామచంద్రం గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, అడ్వకేట్ వైభగవంతరావు గౌడ్. ఈ సందర్భంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదివిన మెదక్ జిల్లా, నిజాంబాద్ జిల్లా, అదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా విద్యార్థినీ, విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఓటర్ నమోదును నవంబర్ ఆరవ తేదీ వరకు చేసుకొని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సద్వినియోగం చేసుకోవాలని అందరికీ పేరుపేరునా విజ్ఞప్తి చేశారు. అందుకుగాను కాకతీయ యూనివర్సిటీ పీజీ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా గ్రాడ్యుయేట్స్ ఓటరు నమోదు ప్రక్రియను ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా చేస్తామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *