76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న – బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

Spread the love

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట పట్టణంలో గాంధీ చౌక్ వద్ద స్వాతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రము సాధించుకున్న తర్వాత స్వాతంత్ర సమరయోధులు అందరూ కలిసి పరిపాలన విధానాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ముసాయిదా కమిటీ వేసి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని తెలియజేస్తూ ప్రతి భారతీయ పౌరుడు గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు సమాజంలో మనం ఏ విధంగా మెదలాలి మరియు ఏ విధంగా మన దేశాన్ని అభివృద్ధి పథంలో ఉంచాలి అనే ఆలోచన పదంతో దేశాన్ని గొప్ప స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దుతారని గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ పౌరులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదన అనంతరం మున్సిపాలిటీ కార్యాలయాల్లో, తాసిల్దార్ కార్యాలయంలో, మండల వ్యవసాయ అధికార కార్యాలయంలో, జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల లో, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో అమూల్యమైన సందేశాన్ని ఉపన్యాసించారు. ఈ యొక్క కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మునుపల్లి రమేష్, కార్యదర్శి కూచిని సతీష్,మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *