ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్ కుంభమేళ త్రివేణి సంగమం క్షేత్రాన్ని దర్శించుకుని కుంభమేళ స్నానాలు చేయడానికి సంపూర్ణంగా సహకరించిన ఏసీపి గారి సూచనల మేరకు చంద్రశేఖర్ సింహ సీఐ గారు స్పెషల్ గాడ్ పోలీస్ సిబ్బందితో సెక్టార్ 4th ఘాట్లో మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలకడం ఎంతో ఆనందంగా ఉందని ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే,ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచనల మేరకు ప్రయాగ కుంభమేళకు విచ్చేయుచున్న భక్తులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సూచనలను పాటించి ప్రయాగ కుంభమేళంలో పాల్గొంటే అందరికీ అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు, కోట్లాదిమంది భక్తులకు మంచి సౌకర్యాలను, భద్రతను ఏర్పాటుచేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క ప్రయాగ కుంభమేళా త్రివేణి సంగమంలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు బసగళ్ల రాములు గౌడ్, బీసీ నాయకులు, గౌడ సంక్షేమ సంఘం నాయకులు మెదక్ రవీందర్ గౌడ్, మాణిక్యం గౌడ్, సినీ పరిశ్రమ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ గౌడ్ మరియు వివిధ రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి కోట్లాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు.