ధర్మోరక్షతిరక్షితః
చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారి పైన ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన దాడి చాలా అమానుషమైనది ధర్మ పరిరక్షకులపై న జరుగుతున్న ఇటువంటి దాడులను ప్రతిఘటిస్తున్నాము. శ్రీరామరాజ్యం స్థాపిస్తానంటూ వీర రాఘవరెడ్డి మరియు మిలిటెంట్లు ధర్మం న్యాయం కొరకు పాటుపడే ఇలాంటి అర్చకులపై దాడి చేయడం చాలా దారుణమని వీటిని ఎవరు కూడా హర్షించరన్నారు.
శ్రీ రంగరాజన్ గారు తన ప్రవచనాలతో ఎంతోమంది భక్తులను చైతన్య పరుస్తున్నారు సన్మార్గంలో నడిపిస్తున్నారు. కావున సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడి పైన యావత్ హిందూ సమాజం పైన ఉన్నది. ఇట్టి హేయమైన చర్యను ఖండిస్తూ పత్రిక ముఖంగా తెలిపినారు.
ఇట్లు
*డా. కందాడై వరదాచార్యస్వామి*
సంగారెడ్డి జిల్లా శ్రీవైష్ణవసంఘం అధ్యక్షులు మరియు
శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి (శ్వాస్) రాష్ట్రకమిటీ
ప్రధానసభ్యులు