నిజాంబాద్, తెలంగాణ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుల మరియు పూర్వ విద్యార్థుల మద్దతు కోరిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయమును సుందర వందరముగా తీర్చిదిద్దుటకు మెదక్ నిజాంబాద్ అదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి క్రమ సంఖ్య రెండు పై ప్రథమ ప్రాధాన్యతో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందర్నీ పేరుపేరునా కోరారు. ఇట్టి విషయంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం శ్రీ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారి సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి పట్టభద్రుల యొక్క సంక్షేమానికి ఉపయోగిస్తామని తెలియజేశారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ జి సాయ గౌడ్, మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొలుపుల రత్నయ్య, యువ నాయకులు జయరాజ్ మరియు పట్టబద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.