కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు అన్నారు. ఇప్పుడు అక్కడ ప్రజలు ఆగమైపోయినం అంటున్నారు. మనం ఇక్కడ అగం కావద్దు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ. వంద అబద్ధాలు అడైనా కాంగ్రెస్ అధికారంలోని రావాలని చూస్తోందని, గతి, సుతి లేని కాంగ్రెస్ నున్నమితే అగం అవుతామన్నారు. కాంగ్రెస్ను నమ్మితే. కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టే అన్నారు. ఆరు గ్యారెంటీలు ఏమో కానీ, ఆరు నెలలకు ఒక్కరూ సీఎం అవుతారన్నారు.