రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తం పట్టించుకోని అధికారులు,నాయకులు

Spread the love

రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తం

పట్టించుకోని అధికారులు,నాయకులు
డోర్నకల్ ప్రతినిధి జూన్ 25 సంచలన వార్త:
డోర్నకల్ మండలం రాముతండా గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షాకాలం మొదలయ్యే సమయంలో ఇటువంటి పరిస్థితి వస్తే వర్షాకాలం అంతట ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామ ప్రజలు రోగాల బారిన పడక తప్పదు. తండావాసులు రాబోయే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తండావాసులు వాపోతున్నారు. చిన్నపాటి వర్షాలకి డ్రైనేజీలు పొంగి రోడ్లపై నడిచే పరిస్థితి లేకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.