విద్యాహక్కు చట్టాన్ని* *పగడ్బందిగా అమలు* *చేయాలి.* *తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (టీబీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. పాషా.*

Spread the love

* *విద్యాహక్కు చట్టాన్ని* *పగడ్బందిగా అమలు* *చేయాలి.*

*తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (టీబీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. పాషా.*

*తల్లిదండ్రులకు అధిక ఫీజుల భారాన్ని తగ్గించాలి.*

మంచిర్యాల బ్యూరో; జూన్ 25(సంచలన వార్త);

కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీనీ అరికట్టాలని కోరుతూ
నాస్పూర్ లోని సమీకృత జిల్లా విద్యా శాఖ కార్యాలయం లో (టి.బి. ఎస్.ఎఫ్) ఆధ్వర్యంలోఈరోజు సూపర్డెంట్ అజయ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా టీ.బి.ఎస్. ఎఫ్. జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.పాషా మాట్లాడుతూ….
జిల్లాలోని కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో
అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తూ, మరోవైపు అడ్మిషన్ పొందిన విద్యార్థుల కు సంబంధించి ఫీజు కన్ఫర్మేషన్, అడ్మిషన్ ఫీజు అంటూ దందా నిర్వహిస్తున్నారు.పుస్తకాలు, యూనిఫాం లు, స్టేషనరి సామాగ్రి మా వద్దే తీసుకోవాలని, లేదా మేము సూచించిన బుక్స్టల్లోనే తీసుకోవాలని lవిద్యార్థుల తల్లిదండ్రులకు హుకుo జారీచేస్తున్నారని వారు ఆరోపించారు.
కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాలను వారి పాఠశాల పేర్లతో ముద్రించి విక్రయిస్తూ /
“విద్యాశాఖ” నిబంధనలను కాళరాస్తున్నరని, పుస్తకాల పై అధిక ధరలు ముద్రించి దోచుకుంటున్నాయని,పుస్తకాలను ఆయా పాఠశాలలకు దగ్గరలోని ఏదో ఒక శెట్టర్ రూమ్, లేదా ఇంటిని అద్దెకు తీసుకుని బహిరంగంగానే విక్రయిస్తున్నారని అన్నారు.
వివిధ రకాల పేర్లు (టెక్నో,ఐఐటీ, నీట్, స్మార్ట్, ఐ.పి.ఎల్, సి.బి.ఎస్.ఈ, ఇంటర్నేషనల్, ఓలాoప్యాడ్, కాన్సెప్ట్, ఏక్షెలేన్సివ్) లాంటి పదాలు తగిలించి కనీస మౌలిక వసతులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క పాఠశాలల్లో నోటీస్ బోర్డు కానీ, టీచర్ల వివరాలు కానీ, ఫీజుల వివరాలు కానీ పొందు పరుస్తాలేరని,
నియంత్రణ లేని ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై విద్యా శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (టీబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీ.బి.ఎస్ ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.