తాళ్ల మల్కాపురం చెరువులో అక్రమ చేపల వేట
సొసైటీ సభ్యులు పాలక వర్గానికి తెలియకుండాదొంగతనంగా చేపలు పట్టుబడి చేసిన దళారులు
(సంచలన వార్త జూన్25 గరిడేపల్లి ప్రతినిధి మేకపోతుల అప్పయ్య గౌడ్)
తాళ్ల మల్కాపురం గరుడసముద్రం చెరువులో అక్రమ చేపల వేట కొనసాగుతోంది. మత్స్యకారులు చేపలు పెంచుకొని జీవనోపాధి పొందాలని ప్రభుత్వమే ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తుంది ఇందులో భాగంగా 2024 నుంచి 26 వరకు రెండు సంవత్సరాలు తాళ్ల మల్కాపురం గరుడ సముద్రం చెరువులో చేప పిల్లలు ప్రభుత్వం పోసింది ఇదే అదునుగా భావించిన గ్రామానికి చెందిన కొందరు దళారులు అక్రమంగా దొంగ సంతకాలు పెట్టుకుని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక కాంట్రాక్టర్ కు సబ్ లీజుకు ఇచ్చినట్లుగా తెలియజేస్తూ అక్రమంగా చేపలు పడుతున్నట్లు సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇట్టి విషయమై పలుమార్లు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసినట్లు వాళ్లు తెలియజేశారు గత రెండు రోజులుగా చెరువులో నీటిని తరలించి గురువారం పెద్ద ఎత్తున చేపలు పట్టుబడి చేశారు. గురువారం అక్రమంగా పట్టిన చేపలు 7 టర్బో లారీలు, నాలుగు టాటా ఏసీ వాహనాలలో సుమారు 85 టన్నుల వరకు పట్టుబడి చేసినట్లు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ సభ్యులను రానివ్వకుండా బయట వ్యక్తులను కాపలాదారులుగా పెట్టుకుని దౌర్జన్యంతో చేపలు పట్టడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొసైటీ కి సంబంధంలేని బయట వ్యక్తులు కర్రలతో బెదిరింపులకు పాల్పడుతుండగా పోలీసులు సైతం సొసైటీ సభ్యులను పాలకవర్గ సభ్యులను చెరువు కాడికి రాకుండా అడ్డుకోవడం గమనించాల్సిన విషయం ఇట్టి విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సొసైటీ సభ్యులు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది