ఎవరు అభివృద్ధి చేస్తారో గమనించి ఓటు వేయాలి: కేసీఆర్..

Spread the love

ఎవరు అభివృద్ధి చేస్తారో గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ములుగులో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. “సమ్మక్క-సారక్క జాతరకు ఒకప్పుడు ఆదరణ లేదు. కనీసం రోడ్డు కూడా సరిగా వేయలేదు. అధికారంలోకి వచ్చాక రోడ్లు వేసుకున్నాం. ఇంకా అభివృద్ధి చేసుకుందా. కాంగ్రెస్‌ 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది. బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల పాలన ఎలా ఉంది?. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలి. తెలంగాణ వచ్చిన రోజు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉండేవి.” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *